: జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య యథాతథం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో వార్డుల పునర్విభజనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గత ఏప్రిల్ లో 200 వార్డులకు పెంచాలని జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 150 వార్డుల సంఖ్యను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. 2011 జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వార్డుల సంఖ్యను పెంచితే సమస్యలు తలెత్తుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అన్నారు.