: ధర్మశాలకు చేరుకున్న టీమిండియా
టీమిండియా ఆటగాళ్లు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చేరుకున్నారు. దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి మొదలయ్యే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా శారీరక దృఢత్వం పెంచడం కోసం హిమాచల్ ప్రదేశ్ లో టీమిండియాకు బ్యూట్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ బ్యూట్ క్యాంప్ లో సైనిక శిక్షణ తరహా సన్నద్ధతతో ఆటగాళ్లు సిద్ధం కానున్నారు. శారీరక దృఢత్వంతోపాటు మానసికంగా కూడా ఆటగాళ్లను సిద్ధం చేస్తారు. ఈ నేపధ్యంలో ఆటగాళ్లు ధర్మశాల చేరుకున్నారు. ఇక్కడి కాంగ్రా విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు సాదరస్వాగతం లభించింది. గతంలో టీమిండియా వరల్డ్ కప్ సాధించినప్పుడు కూడా ఇదే రకమైన సన్నాహాలు చేశారు. సౌతాఫ్రికా జట్టు శారీరకంగా దృఢంగా ఉంటారు కనుక వారికి దీటైన ఆటతీరు కనబర్చాలంటే ఇంతటి పరిశ్రమ తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.