: సృజనాత్మకతతో నిజాయతీకి ముప్పు
సృజనాత్మకత పాళ్లు ఎక్కువగా ఉన్నవారిలో నిజాయతీ లోపిస్తుందని ఓ పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న సిరాకస్ యూనివర్సిటీ మనుషుల్లో సృజనాత్మకత, నిజాయతీ అనే అంశంపై పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో ఆసక్తికర అంశం వెల్లడైంది. అత్యంత అరుదుగా ఉండే సృజనాత్మకత తనలో ఉందని ఒక మనిషి ఎప్పుడు భావిస్తాడో, అప్పటి నుంచీ అతనిని అవసరం లేని ఆలోచనలు చుట్టుముడతాయని పరిశోధన తెలిపింది. ఈ ఆలోచనలే అతడిలోని నిజాయతీని కొంచెం కొంచెంగా తగ్గిస్తాయని పరిశోధన పేర్కొంది. తనలో సృజనాత్మకత ఎక్కువ ఉందని భావించే వ్యక్తులు ప్రాక్టికల్ గా చేయాల్సిన పనులను నిర్లక్ష్యం చేస్తారని పరిశోధన తేల్చింది. వాటి గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారని, అలా నిజాయతీ లేని వారిగా నిలిచిపోతారని పరిశోధన స్పష్టం చేసింది.