: గాన కోకిలకు సైకతశిల్పంతో జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈరోజు 86వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాన్ని పురస్కరించుకుని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరి సముద్రతీరాన లతా ప్రతిమను సైకత శిల్పంగా రూపొందించారు. ఇందుకు పట్నాయక్ దాదాపు 6 టన్నుల ఇసుకను ఉపయోగించి లత చిత్రాన్ని, కేక్, తంబురలను తయారు చేశారు. ఇది చూసిన సందర్శకులు, అభిమానులు కూడా లతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. లతాకు తాను పెద్ద అభిమానినని ఈ సందర్భంగా పట్నాయక్ తెలిపారు.