: విజ్ క్రాఫ్ట్ కు ఇచ్చే విషయం పరిశీలనలో మాత్రమే ఉంది: మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన, భూమిపూజ నిర్వహణ బాధ్యతను ముంబైకి చెందిన విజ్ క్రాఫ్ట్ సంస్థ దక్కించుకుందంటూ వచ్చిన వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. ఇంతవరకు ఏ సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించలేదని, విజ్ క్రాఫ్ట్ పేరు పరిశీలనలో మాత్రమే ఉందని మీడియాతో చెప్పారు. రాజధాని శంకుస్థాపన, భూమి పూజకు రాజధాని ప్రాంత రైతులను తప్పకుండా ఆహ్వానిస్తామని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని శంకుస్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ఇక రాజధాని మాస్టర్ ప్లాన్ పూర్తయ్యాక డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణం చేపడతామన్నారు.