: హార్దిక్ పటేల్ వెనుక ఆరెస్సెస్ హస్తం: టీ కాంగ్ నేత వీహెచ్ ఆరోపణ


టీ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కొద్దిసేపటి క్రితం సరికొత్త కామెంట్ చేశారు. గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ల కోసం యువ సంచలనం హార్దిక్ పటేల్ పోరు బాట పట్టి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీశారు. తత్ఫలితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ముచ్చెమటలు పట్టించారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన హార్దిక్ పటేల్ వెనుక బీజేపీ సిద్ధాంతకర్తగా పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) హస్తం ఉందని వీహెచ్ ఆరోపించారు. బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకు గండి కొట్టేందుకే ఆరెస్సెస్ హార్దిక్ పటేల్ ను రంగంలోకి దించిందని ఆయన కొత్త వాదనను వినిపించారు. బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు తగ్గితే సహించేది లేదని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News