: బంజారాహిల్స్ లో దుకాణంలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు వ్యక్తుల దుర్మరణం


హైదరాబాదులోని బంజారాహిల్స్ లో నిన్న రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబరు:3లో వేగంగా దూసుకువచ్చిన కారు అక్కడి ఓ దుకాణంలోకి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులను ఉప్పల్ కలాన్ కు చెందిన శరత్ చంద్ర, తేజ, నరేన్ లుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ రెడ్డిని చికిత్స నిమిత్తం కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News