: తెలంగాణాకు వర్ష సూచన
క్యుములో నింబస్ మేఘాల కారణంగా వచ్చే 24 గంటల్లో తెలంగాణాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు అధికారులు చెప్పారు.