: రాళ్లు రువ్వుకున్న టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు
మార్కెట్ యార్డులోని ఓ భవనం శంకుస్థాపన విషయంలో టీడీపీ, టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పాలకుర్తి మార్కెట్ యార్డులోని ఒక భవనం శంకుస్థాపన విషయమై టీడీపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో పరిస్థితి శృతి మించి ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. ఈ సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. పాలకుర్తి ఎస్ఐకు కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.