: అనుమతి లేకుండా ప్రవేశించారని మేధాపాట్కర్ అరెస్టు
ఆందోళనలు జరుగుతున్న గ్రామంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అలహాబాద్ లోని కచ్రి గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. ఆ సమయంలో మేధాపాట్కర్, ఆమె అనుచరులు అనుమతి లేకుండా ప్రవేశించారు. ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందువల్ల అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకూడదని, అందుకు మేధాపాట్కర్ అమె అనుచరులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు.