: వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి: కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గర్భిణికి సిజేరియన్ చేస్తుండగా మెడకు గాయమై శిశువు మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఘటనతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. దీనికి బాధ్యులైన వైద్యులపై ఆయన మండిపడ్డారు. శిశువు మృతికి గల కారణాలపై తక్షణం విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కృష్ణమూర్తి ఆదేశించారు.