: రైతులకు బీమా సొమ్ము సక్రమంగా అందట్లేదు: గవర్నర్ నరసింహన్
బీమా డబ్బులు రైతులకు సక్రమంగా అందట్లేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకటనలతో రైతులకు భరోసా కల్పించలేకపోతున్నామని అన్నారు. వినియోగదారుల అవగాహనా సదస్సులు పల్లెల్లో నిర్వహిస్తే బాగుంటుందని నరసింహన్ అభిప్రాయపడ్డారు.