: పెరోల్ ముగిసింది... సంజయ్ దత్ మళ్లీ జైలుకి
ముప్ఫై రోజుల పెరోల్ ముగియడంతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మళ్లీ జైలుకు వెళ్లారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సంజయ్ దత్ ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే 1996లో 18 నెలల పాటు శిక్ష అనుభవించిన కాలాన్ని మినహాయించిన కోర్టు మరో 42 నెలల శిక్ష అనుభవించాలని నిర్దేశించింది. పూణె-ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ గత నెలలో పెరోల్ పై బయటకు వచ్చారు. ఆ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సంజయ్ దత్ భార్య మాన్యత, కవల పిల్లలు ఇక్రా, షహరాలు మున్నాభాయికి వీడ్కోలు పలికారు.