: గుంటూరు జిల్లాలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కారు... ఆరుగురి మృతి
వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన గుంటూరు జల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి నుంచి ఫిరంగిపురం వెళ్తుండగా తక్కెళ్ళపాడు వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.