: ఐశ్వర్యారాయ్ కి దర్శకుడి కాంప్లిమెంట్స్!
అందాల తార ఐశ్వర్యరాయ్ పై ఆమె తాజా చిత్రం 'జబ్బా' దర్శకుడు సంజయ్ గుప్తా ప్రశంసల వర్షం కురిపించాడు. ఐశ్వర్యారాయ్ అంకిత భావం అద్భుతమైనదని అన్నాడు. నటిగా, తల్లిగా రెండు పాత్రలకు తను న్యాయం చేస్తోందని అన్నాడు. జబ్బా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, షూటింగ్ జురుగుతున్నప్పుడు ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు ఆరోగ్యం బాగులేకపోయినా ఐశ్వర్య షూటింగ్ ఆపలేదని అన్నాడు. "ఓ రోజు అర్ధరాత్రి 3 గంటల వరకు షూటింగ్ జరిగిందని, ఇంతలో ఐశ్వర్య సిబ్బంది వచ్చి, ఆమె వాంతి చేసుకుందని చెప్పారు. నేను ఐశ్వర్య అనుకున్నాను. అయితే, వాంతి చేసుకున్నది ఆమె కూతురు ఆరాధ్య అని తెలిసింది. ఆ సమయంలో ఆమె కుటుంబం ముంబైలో లేదు. దాంతో కూతురుకి ఒంట్లో బాగుండకపోయినప్పటికీ, షూటింగ్ రద్దు చేయడం ఇష్టం లేని ఐశ్వర్య, ఆరాధ్యను అలాగే తీసుకుని షూటింగ్ కు వచ్చిందట. అది విని ఆశ్చర్యపోయాను. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే కనుక షూటింగ్ రద్దు చేసేసేవాడిని" అంటూ ఐశ్వర్యకు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు దర్శకుడు సంజయ్.