: మానవత్వాన్ని కోల్పోయిన ప్రపంచం: నోబెల్ గ్రహీత మలాలా


సిరియా దేశానికి మరింత సాయపడాలని ప్రపంచ నేతలకు తాను విన్నవించుకుంటున్నానని నోబెల్ ప్రైజ్ గ్రహీత, పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయి అన్నారు. ఐక్యరాజ్యసమితి వద్ద విలేకరులతో ఆమె మాట్లాడింది. సిరియా బాలుడు అయలాన్ కుర్దీ సంఘటన గురించి ప్రస్తావిస్తూ ప్రపంచం తన మానవత్వాన్ని కోల్పోయిందంటూ మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. సిరియా, ఇరాక్ దేశాలకు చెందిన ఉగ్రవాదుల చేతుల్లో ఉండిపోయిన బాలికలపై జరుగుతున్న దురాగతాల గురించి వినలేకపోతున్నానన్నారు. వారు పెట్టే చిత్రహింసల గురించి మీడియాలో వస్తున్న వార్తలను, దృశ్యాలను చూడలేకపోతున్నానని, అందుకే అవి చూడటం మానేశానని అన్నారు. అయినపప్పటికీ ఆ దృశ్యాలు పదేపదే గుర్తుకువస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మద్దతు, సహాయం కావాలని కోరుకునే ప్రజలకు మనస్పూర్తిగా అన్నిదేశాలు వారికి సహకరించాలని మలాలా కోరారు.

  • Loading...

More Telugu News