: గాడిద పాలు లీటర్ రూ. 10 వేలు... అయినా డిమాండే!


గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము (గాడిద) పాలు అంటూ వేమన పద్యంలో మనందరం చదువుకొనే ఉంటాం. కానీ, ఇప్పుడు ఆ సూత్రం రివర్స్ అవుతోంది. వేమన గారు తేలిగ్గా తీసిపారేసిన ఆ గాడిదకే ఇపుడు టైమ్ వచ్చింది. పల్లెటూర్లలో కూడా వాటిని వెతుక్కుంటూ వస్తున్నారు. ఎందుకో తెలుసా? వాటి పాల కోసం! నిజమే, గాడిద పాల కోసం జనాలు క్యూ కడుతున్నారు. దీంతో, వాటి పాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఉబ్బసం, జలుబు, ఆయాసం, దగ్గులాంటి జబ్బులు గాడిద పాలు తాగితే తగ్గిపోతాయనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. దీంతో, ఈ పాలకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో, పాలిచ్చే గాడిదలను పట్టుకుని వాటి యజమానులు ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ మంచి బిజినెస్ చేసుకుంటున్నారు. గాడిద పాల రేటు ఎంతో చెబితే కళ్లు తేలేయక మానరు. ఒక్క లీటర్ పాలు అక్షరాలా రూ. 10 వేలు. అంటే పావు లీటర్ పాలు రెండున్నర వేల రూపాయలన్నమాట. ఈ రేటుకి గాడిద పాలను నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో అమ్ముకుని గాడిదల ఓనర్లు మంచి బిజినెస్ చేసుకున్నారు!

  • Loading...

More Telugu News