: ఉగ్రవాదాన్ని, మతాన్ని వేరుచేయాలి: మోదీ


ఉగ్రవాదం, మతం వేరని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానంతరం జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమైన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మతాన్ని, ఉగ్రవాదాన్ని వేరుగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. యువత ఉగ్రవాదం వైపు మళ్లకుండా చేయాలంటే మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేయాలని అన్నారు. అంతర్జాతీయంగా ఐఎస్ఐఎస్ ను కట్టడి చేయడం అన్ని దేశాలకు సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News