: ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలపై ఏకసభ్య కమిటీ


ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం వన్ మెన్ (ఏకసభ్య) కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో నారాయణ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరోవైపు నాగార్జున యూనివర్శిటీలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి, విజయవాడ స్టెల్లా కళాశాలలో మరో విద్యార్థిన్ని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాటన్నింటిపై ఈ వన్ మెన్ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News