: తెలంగాణలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు... ముగ్గురు రైతుల బలవన్మరణం
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడంలేదు. ప్రతిరోజు పలువురు రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాఘవాపూర్ లో శ్రీశైలం అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి కిష్టాపురం తండాలో అప్పుల బాధతో పత్తిరైతు మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక పరకాల మండలం, రామకృష్ణాపురంలో రాజేందర్ అనే రైతు కూడా అప్పుల బాధతో ఉరి వేసుకుని చనిపోయాడు.