: కేటాయించిన సమయం కన్నా 13 నిమిషాలు అదనంగా ప్రసంగించిన మోదీ
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ సత్తాను చాటారు. సాధారణంగా సమితిలో ఎంత పెద్ద నేత అయినా సరే... కేటాయించిన సమయం కన్నా ఎక్కువ సేపు మాట్లాడుతుంటే, అక్కడున్న సదస్సు ఛైర్మన్ అప్రమత్తం చేస్తారు. కానీ, నరేంద్ర మోదీ ప్రసంగం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. వాస్తవానికి, నరేంద్ర మోడీ ప్రసంగానికి కేవలం 10 నిమిషాలు మాత్రమే కేటాయించారు. హిందీలో ప్రారంభమైన నరేంద్ర మోదీ ప్రసంగం నిర్దేశిత 10 నిమిషాలు దాటిపోయి... ఇంకా కొనసాగుతూనే ఉంది. రూల్స్ ప్రకారం సమయం మించిపోతోందని మోదీకి సూచనలు పంపాలి. కానీ, కో-ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉగాండా అధ్యక్షుడు యొవెరి ముసువెని మాత్రం మోదీకి ఏకంగా 13 నిమిషాలను అదనంగా కేటాయించారు. దీంతో, మోదీ ప్రసంగం పూర్తి స్థాయిలో కొనసాగింది. అనంతరం ముసువెని మాట్లాడుతూ, భారత్ లో 120 కోట్ల మంది జనం ఉన్నారని... 10 కోట్ల మందికి ఒక్కో నిమిషం వంతున అదనపు సమయాన్ని కేటాయించామని సరదాగా వ్యాఖ్యానించారు.