: మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ


కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నల్గొండ జిల్లాలోని కొలనుపాక గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 'సంసద్ ఆదర్శ గ్రామ యోజన' (ఎన్ జీఎన్ వై) ద్వారా మంత్రి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారని పేర్కొంది. ఇప్పటికే ఈ పథకం కింద వరంగల్ జిల్లాలోని సన్నూరు, అన్నారం షరీఫ్ గ్రామాలను మంత్రి దత్తత తీసుకున్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News