: నిధుల వినియోగంలో ‘అశోకుడి’ ఆదర్శం...ఎంపీల్యాడ్స్ ఖర్చులో కేంద్ర మంత్రి పారదర్శకత


చెట్లు నాటి, చెరువులు తవ్వించి నాటి అశోకుడు ఆదర్శంగా నిలిస్తే, సర్కారీ నిధులను స్వప్రయోజనాలకు కాకుండా పారదర్శకంగా ఖర్చు చేసి నేటి ‘అశోకుడు’ మన చట్టసభల సభ్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత అశోక గజపతిరాజు తొలి యత్నంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసుకున్నారు. గతేడాది తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.5 కోట్ల ఎంపీ ల్యాడ్స్ ను దాదాపుగా పూర్తి స్థాయిలో (రూ.4,97,85,964) ఖర్చు పెట్టేశారు. అది కూడా అత్యంత పారదర్శకంగా ఆయన ఖర్చు పెట్టిన తీరుపై ఎంపీలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏఏ అంశానికి ఎంతెంత ఖర్చు పెట్టారంటే... రూ.3.08 కోట్లతో విద్యార్థులకు ఫర్నీచర్‌ సమకూర్చారు. ఆరోగ్య కేంద్రాలకు సోలార్‌ హీటర్ల కోసం రూ.16 లక్షలు అందజేశారు. రక్తనిల్వ కేంద్రానికి రూ.8 లక్షలు, ఆస్పత్రుల్లో లాండ్రీ సౌకర్యానికి రూ.17.5 లక్షలు, ఎల్‌ఈడీ బల్బుల కోసం రూ.77.70 లక్షలు, రైల్వేస్టేషన్‌లో బెంచీల కోసం రూ.3 లక్షలు, వ్యాయామశాలకు రూ.10 లక్షలు, బోర్‌వెల్స్‌కు రూ.41.5 లక్షలు ఖర్చు చేశారు. ఇక తాను దత్తత తీసుకున్న ద్వారపూడి గ్రామంలో సామాజిక మరుగుదొడ్ల కోసం రూ.6 లక్షలు, సోలార్‌ వెలుగుల కోసం రూ.3.53 లక్షలు, తాగునీటి పైపులైన్ల కోసం రూ.6 లక్షలు కేటాయించారు.

  • Loading...

More Telugu News