: మోదీ విందు..భలే పసందు!
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో భారతీయ వంటకాలు ఘుమఘుమలాడాయి. భారత్ లో ప్రఖ్యాతి పొందిన వంటకాలన్నీ ఇక్కడ వడ్డించారు. మెనూలో గుజరాతీ కార్న్ థోక్లా, స్మోక్ డ్ చిల్లీ క్రిస్టల్స్, కోకోనట్ చెట్నీ మౌసీ, పోహో సీ బాస్, బిస్బేలా బాత్, పత్రానీ ఫిష్ సాస్, కాశ్మీరి ఖవా, మిజోరాం వంటకం... ఇలా మొత్తం 26 వంటకాలు ఆ విందులో వడ్డించారు. ఇరవై ఆరే ఎందుకు వడ్డించారంటే, మన దేశంలో జరుపుకునే పర్వదినాల నేపథ్యంలోనే ఈ సంఖ్యను ఎంచుకున్నారు. మరో విషయం.. ఈ వంటకాలు ఇంత రుచికరంగా ఉండటానికి ముఖ్యకారణం ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా తయారు చేయడమేనని చెబుతున్నారు.