: ఖతార్ లో 'పిఫా 2022 వరల్డ్ కప్'
ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న '2022 వరల్డ్ కప్'కు వేదికగా ఖతార్ ను 'ఫిఫా' ప్రకటించింది. 2022 నవంబర్ 21 సోమవారం నుంచి డిసెంబర్ 18 ఆదివారం వరకు మొత్తం 28 రోజులపాటు టోర్నీ జరగనుందని ఫిఫా తెలిపింది. ఎప్పట్లా జూన్, జూలై మధ్యలో ఈ టోర్నీ నిర్వహించాలని భావించారు ఫిఫా అధికారులు. అయితే ఖతార్ లో ఎండ వేడిమికి ఆటగాళ్లు తట్టుకోలేరని భావించి, టోర్నీని నవంబర్, డిసెంబర్ లలో నిర్వహించాలని భావించినట్టు ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తెలిపారు. ఈ ప్రపంచ కప్ లో 32 దేశాల జట్లు ఫుట్ బాల్ చాంపియన్ షిప్ కోసం ఆడనున్నాయని ఆయన తెలిపారు.