: నిమజ్జనం సందర్భంగా 400 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ అధికారులు
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వచ్చే ఆదివారం నాడు సుమారు 400 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బషీర్ బాగ్, ఇందిరాపార్క్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని చెప్పారు. నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చన్నారు. ట్యాంక్ బండ్ పైన, ఇంకా ఇతరచోట్ల జరిగే వినాయక నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందునే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు.