: దూసుకుపోతున్న సానియా-హింగిస్ జోడీ... గ్వాంగ్జౌ ఓపెన్ ఫైనల్ లో అడుగుపెట్టారు


మహిళల టెన్నిస్ డబుల్స్ లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ దూసుకుపోతోంది. దక్షిణకొరియాలో జరుగుతున్న గ్వాంగ్జౌ ఓపెన్ టెన్నిస్ లో వారిద్దరూ ఫైనల్ కు చేరారు. సెమీ ఫైనల్లో 6-3, 6-4 తేడాతో గ్లుష్కో, రెబెకా పీటర్సన్ ల జోడీపై సానియా జోడీ విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో తొలిసెట్ ను తేలికగా గెలుచుకున్న సానియా-హింగిస్ లు రెండో సెట్ లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ గెలుచుకున్నారు. గంటా 12 నిమిషాల్లో మ్యాచ్ ముగించారు. ఇటీవల వరుసగా వింబుల్డన్ టైటిళ్లు గెలుచుకున్న వారిద్దరూ... ఈ ఓపెన్ లో టైటిల్ ను దక్కించుకుంటారా? అనేది చూడాలి.

  • Loading...

More Telugu News