: బీరులో ఆ లక్షణం కూడా వుందట!
మితంగా బీరు తాగితే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయట. వారానికి కనీసం రెండు బీర్లు తాగితే చాలు గుండెపోటుకు వారె చెక్ పెట్టొచ్చని అంటున్నారు పరిశోధకులు. స్వీడన్ లోని గోదెన్ బర్గ్ యూనివర్శిటీకి చెందిన సల్ గ్రెన్స్కా అకాడమీ పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బీర్ తాగే అలవాటు ఉన్న మహిళలను, ఆ అలవాటు లేని మహిళలతో పోల్చి చూశామని పరిశోధకులు చెప్పారు. సుమారు యాభై ఏళ్ల కాలంలో దాదాపు 1500 మంది మహిళలపై పరిశోధన చేశారు. బీరు తాగే అలవాటున్న మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశాలు 30 శాతం తక్కువని ఆ పరిశోధనలో తేలింది. 1968 నుంచి 2000 వరకు పరిశోధకులు ప్రశ్నించిన మహిళల్లో 70, 92 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు ఉన్నారు. అయితే, బీరు తాగమన్నారుకదా అని చెప్పి ఇష్టమొచ్చినట్లు తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తక తప్పదన్నారు.