: ఉదయ్ తో నా బంధం ప్రత్యేకం: నర్గీస్ ఫక్రి
బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రాతో తన బంధం ప్రత్యేకమైనదని నటి నర్గీస్ ఫక్రి తెలిపింది. రియాలిటీ షో 'లుక్ హూ ఈజ్ టాకింగ్' రెండో సీజన్ కోసం జరిపిన ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ, మోడలింగ్ రంగంలోకి వచ్చిన దగ్గర్నుంచి తనకు స్నేహితులు తక్కువయ్యారని చెప్పింది. సినిమా రంగంలో కూడా చాలా తక్కువ మందితో టచ్ లో ఉంటానని నర్గీస్ వెల్లడించింది. ఉదయ్ చోప్రా తనకు చాలా ముఖ్యమైన వ్యక్తని, అతనితో అన్ని విషయాలు పంచుకోగలనని తెలిపింది. అలాగే 'మై తేరా హీరో' సహనటుడు వరుణ్ ధావన్ కూడా మంచి స్నేహితుడని తెలిపింది. కాగా, నర్గీస్ ఫక్రి, ఉదయ్ చోప్రా డేటింగ్ లో ఉన్నారంటూ గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.