: ఒబామాకు అరుదైన కానుక ఇస్తున్న మోదీ


అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు. వచ్చే సోమవారం ఒబామాను మోదీ కలవనున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆటోగ్రాఫ్ చేసిన భారత జాతీయ పతాకాన్ని ఒబామాకి ఇవ్వనున్నారు. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా చేతుల మీదుగా దాన్ని అందజేయనున్నారు. అమెరికాలోని 40 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్ కి ప్రధాని విందు ఇచ్చారు. ఆ విందులో పలు అరుదైన వంటకాలను వికాస్ ఖన్నా ఆధ్వర్యంలో తయారుచేశారు. అయితే జాతీయ జెండాపై మోదీ సంతకం చేయడం పతాక గౌరవానికి సంబంధించిన నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందా? అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ తలెత్తింది.

  • Loading...

More Telugu News