: ఆ 350 కోట్ల రూపాయలతో అమరావతిలో ఏం నిర్మించాలంటే..!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక నిధుల కింద రూ. 1000 కోట్లను మంజూరు చేసిన కేంద్రం, అందులో రూ. 350 కోట్లను నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి వెచ్చించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నిధులతో గవర్నర్ నివాసమైన రాజ్ భవన్, హైకోర్టు, మంత్రుల కార్యాలయాలతో కూడిన సెక్రటేరియేట్, అసెంబ్లీ, శాసన మండలి తదితర ప్రధాన మౌలిక వసతులను కల్పించుకోవాలని సూచించింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,403 కోట్లను ఇచ్చామని కేంద్రం తెలిపింది. 2015-16 సంవత్సరానికి గాను పన్ను రాయితీలను రాష్ట్రానికి దగ్గర చేశామని గుర్తు చేసింది.