: కన్నీటి పర్యంతమైన బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్, ఓదార్చిన సింధు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత మహిళగా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్, తనపై సెలక్టర్లు, రిఫరీలూ వివక్షను చూపుతున్నారంటూ, కన్నీటి పర్యంతం అవడం సంచలనం కలిగించింది. ఈశాన్య భారతావనికి చెందిన అమ్మాయిని కావడం వల్లే తనపై వివక్ష చూపిస్తున్నారంటూ ఈ మణిపురి బాక్సర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను భారతీయురాలినేనని, కొన్నిసార్లు రిఫరీలు, జడ్జీలు అనుకూల ఫలితాలను ఇవ్వకపోయినా పైకి చెప్పకుండా మనసులోనే బాధపడ్డానని ఆమె తెలిపింది. హర్యానాకు చెందిన బాక్సర్ పింకీ జాంగ్రాకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ తనను విస్మరిస్తున్నారని మేరీ కోమ్ ఆరోపించింది. పింకీ జాంగ్రా తో పోటీ పడినప్పుడల్లా తానే గెలుస్తున్నానని, అయినా సెలక్టర్లు ఆమెకే మద్దతిస్తున్నారని అన్నారు. ఆమె మీడియా సమావేశంలో ఏడుస్తుంటే, పక్కనే ఉన్న షట్లర్ పీవీ సింధు ఓదార్చింది.