: ఈసారి సుజనా చౌదరి మాట నిజమైంది... ఏపీకి 1,100 కోట్లు ప్రకటించిన కేంద్రం


ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి గతంలో పలుమార్లు చేసిన ప్రకటనలు వాస్తవరూపం దాల్చలేదు. అయినా ఆయన నిన్న మరోమారు ధైర్యం చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ మినహా మిగిలిన వాటికి ఆర్థిక సాయానికి సంబంధించి సాయంత్రంలోగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడుతుందని ఆయన నిన్న మధ్యాహ్నం ప్రకటించారు. సుజనా ప్రకటనకు అనుగుణంగానే సాయంత్రానికల్లా ఏపీకి రూ.1,100 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలైంది. ఇందులో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.400 కోట్లను విడుదల చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

  • Loading...

More Telugu News