: కార్మికులకు సింగరేణి కాలరీస్ తీపి కబురు... లాభాల్లో 21 శాతాన్ని పంచుతుందట!


కొత్త పన్నులతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందనుకున్న సింగరేణి కాలరీస్ యాజమాన్యం వారికి తీపి కబురు చెప్పింది. గతేడాది తన ఖాతాలో జమ అయిన లాభంలో 21 శాతాన్ని కార్మికులకు బోనస్ గా ప్రకటించేందుకు యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు నిన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయిన తర్వాత సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికులకు వాటాలు చెల్లించనున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.491 కోట్లు, అందులో 21 శాతం, అంటే రూ.103 కోట్లను కార్మికులకు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ నెల జీతంతో కలిసి ఈ బోనస్ కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని శ్రీధర్ చెప్పారు. ఇక కార్మికులపై వడ్డించాలనుకున్న ఫ్రొఫెషనల్ ట్యాక్స్ నిర్ణయంపై యాజమాన్యం వెనకడుగేసింది. కార్మికుల నుంచి ఎలాంటి ఫ్రొఫెషనల్ ట్యాక్స్ ను వసూలు చేయబోమని తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News