: ఆస్ట్రేలియా పాతతరం క్రికెటర్ హరాల్డ్ కన్నుమూత
ఆస్ట్రేలియా పాతతరం క్రికెటర్ హరాల్డ్ స్టాప్లెల్టన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు న్యూసౌత్ వేల్స్ తరపున ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన ఆయన చనిపోయినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్ సైట్ తెలిపింది. గత జనవరిలో సిడ్నీలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా హరాల్డ్ తన వందవ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ మ్యాచ్ ను హరాల్డ్ టీవీలో వీక్షించగా, ఆయనకు సిడ్నీ గ్రౌండ్ స్కోరు బోర్డు ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపింది. ఎన్నో ఆటల్లో నైపుణ్యం ఉన్న హరాల్డ్ ప్రత్యేకంగా క్రికెట్ నే ఎంచుకున్నట్టు న్యూసౌత్ వేల్స్ సీఈవో ఆండ్రూ జోన్స్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయం కావడంతో ఆయనకు దేశం తరపున ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం రాలేదన్నారు. ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడినప్పటికీ దేశ క్రికెట్ కు ఎన్నో సేవలందించినట్టు జోన్స్ వివరించారు.