: పెను ఘోరం... 220కి పెరిగిన మక్కా మృతుల సంఖ్య


దాదాపు 25 లక్షల మంది ఒకే ప్రాంతంలో ఉన్న వేళ, అధికారుల్లో సమన్వయం కొరవడితే ఎలా ఉంటుందో సౌదీ ప్రభుత్వానికి తెలిసొచ్చింది. కేవలం వస్తున్న యాత్రికుల సంఖ్యను అంచనా వేయడంలో జరిగిన తప్పు సౌదీ చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఉదయం సైతానును రాళ్లతో కొట్టే క్రమంలో లక్షలాది మంది ఒకేసారి తరలిరాగా తీవ్ర తొక్కిసలాట జరిగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 220కి చేరింది. ఈ ఘోర దుర్ఘటనలో 600 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులకు తీవ్రగాయాలు అయ్యాయి. వందల మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వివరించారు. పక్షం రోజుల వ్యవధిలో మక్కాలో రెండు పెను ప్రమాదాలు జరిగినప్పటికీ, సైతానును రాళ్లతో కొట్టేందుకు తరలివస్తున్న వారి సంఖ్య ఎంత మాత్రమూ తగ్గలేదు. నేటితో హజ్ యాత్ర ముగియనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News