: అహ్మదాబాదులో హైకోర్టుకు వచ్చిన హార్దిక్ పటేల్... పోరాటం ఆగబోదని ప్రకటన


పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరు మొదలెట్టి దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్ నేటి ఉదయం అహ్మదాబాదు లోని గుజరాత్ హైకోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా తన అదృశ్యానికి సంబంధించిన పరిణామాలను ఆయన న్యాయమూర్తికి వివరించారు. తనను కిడ్నాప్ చేసిన తీరును కూడా ఆయన జడ్డీకి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓబీసీ రిజర్వేషన్ల కోసం మొదలుపెట్టిన పోరు ఆగబోదని ప్రకటించారు. అంతేకాక అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ కాలుమోపగానే నిరసన సెగలు తగిలాయన్నారు. అమెరికాలోని తమ సామాజిక వర్గం ప్రతినిధులు మోదీకి నిరసన తెలిపారన్నారు. గతంలో బీజేపీకి ఇచ్చిన విరాళాలను కూడా వెనక్కిచ్చేయాలని తమ పటేళ్లు ఆ పార్టీని కోరారన్నారు. గతంలో అమెరికాలో మోదీ పర్యటన సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాల కోసం ఒక్క తమ సామాజికవర్గానికి చెందిన వారే రూ.35 లక్షల డాలర్లను బీజేపీకి అందజేశారన్నారు. ఆ సొమ్మంతా తిరిగి ఇచ్చేయమని తమ పటేళ్లు బీజేపీకి ఇప్పటికే లేఖలు రాశారన్నారు.

  • Loading...

More Telugu News