: బీహార్ లో బీజేపీ విజయం తథ్యం... జోస్యం చెప్పిన వెంకయ్యనాయుడు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా వెంకయ్య ఈ మేరకు వ్యాఖ్యానించారు. బీహార్ లో తమ ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా తమ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుకోవడమంటే, అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని కూడా వెంకయ్య వ్యాఖ్యానించారు.