: ‘గాలి’ ఇంట్లో అణువణువునూ తనిఖీ చేసిన సిట్...వాటర్ ట్యాంకునూ వదలని వైనం


మైనింగ్ అక్రమ రవాణాలో జైలు ఊచలు లెక్కిపెట్టి వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడప్పుడే ఊపిరి పీల్చుకునేలా లేరు. కోర్టులో బెయిల్ లభించి బయటకు వచ్చినా ఈ కేసులో ఆయనను పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. నిన్న బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు ఆయన ఇంటిలోని అణువణువునూ గాలించారు. ఇల్లంతా వెతికిన పోలీసులు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకును కూడా వదలలేదు. ఇంటి పైకెక్కి వాటర్ ట్యాంకు పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక ఇంటి ఆవరణలో ఉన్న జనరేటర్ గదిలో కూడా పోలీసులు తనిఖీ చేశారు. గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో పెద్ద ఎత్తున పత్రాలను సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, బెంగళూరులోని పారిజాత అపార్ట్ మెంటులోని గాలి జనార్దన్ రెడ్డి ఫ్లాట్ లోనూ పోలీసులు సోదాలు చేశారు.

  • Loading...

More Telugu News