: దాల్మియాపై పాక్ క్రికెట్ దిగ్గజం ప్రశంసలు... ఉపఖండ ప్రతిష్ఠ పెంచారని వ్యాఖ్య
దివంగత బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియాపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ప్రశంసల వర్షం కురిపించాడు. బీసీసీఐ, టీమిండియా జట్లపై నిత్యం విమర్శల జడివాన కురిపించే పాక్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్, దాల్మియా హఠాన్మరణంపై సంతాపం ప్రకటించాడు. అంతేకాక ప్రపంచ క్రికెట్ లో ఉపఖండం ప్రతిష్ఠను దాల్మియా ఇనుమడింపజేశారని అతడు కొనియాడాడు. ‘‘క్రికెట్ కు తీరని లోటు మిగిల్చి దాల్మియా వెళ్లిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఉపఖండ ప్రతిష్ఠను పెంచినవాడిగా దాల్మియాను అందరూ గౌరవిస్తారు. దాల్మియా పాకిస్థాన్ క్రికెట్ కు నిజమైన స్నేహితుడిగా నిలిచాడు’’ అని మియాందాద్ పేర్కొన్నాడు.