: నా తమ్ముడు ఎమ్మెల్సీ బరిలో దిగుతాడు... కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న సంచలన ప్రకటన చేశారు. నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో తన సోదరుడు, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. నల్లగొండ జిల్లా ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ ఓట్లున్నాయని చెప్పిన ఆయన తన సోదరుడి విజయం నల్లేరుపై నడకేనని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ అధిష్ఠానం అనుమతితో ఆయన ఈ ప్రకటన చేశారా? లేక సొంతంగానే చేశారా? అన్న విషయంపై పార్టీ నేతల్లో పెద్ద చర్చ మొదలైంది!