: మోదీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరి కన్నుమూత
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద్ గిరి (87) నిన్న రాత్రి కన్నుమూశారు. గత పది రోజులుగా జాలీగ్రాండ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దయానంద్ గిరి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నిన్న సాయంత్రం ఆయనను ఆశ్రమానికి తరలించారు. తాను స్థాపించిన దయానంద్ ఆశ్రమంలోనే శిష్యుల ఉపచారాల మధ్య ఆయన తుదిశ్వాస విడిచారు. సరిగ్గా రెండు వారాల క్రితం నరేంద్ర మోదీ రుషికేష్ వెళ్లి దయానంద్ గిరిని పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న మోదీ, తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపిన ధన్యుడని, ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపారని కొనియాడారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకెంతో లోటని అన్నారు.