: జగన్ పై టీడీపీ బహిరంగ లేఖాస్త్రం...కోట్లు కొల్లగొట్టి నీతులు చెబుతారా? అని నిలదీత


వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార టీడీపీ ముప్పేట దాడి చేస్తూనే ఉంది. అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న జగన్ పై ఇంటా, బయటా టీడీపీ నేతలు ఘాటు పదజాలంతో కూడిన విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదాపై గుంటూరులో జగన్ చేపట్టనున్న దీక్షపై ఆ పార్టీ బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించింది. ఈ మేరకు నిన్న టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేరిట బహిరంగ లేఖ విడుదలైంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టింది చాలక ఇప్పుడు నీతులు చెప్పడానికి వచ్చారా? అంటూ ఆ లేఖలో జగన్ ను ఆంజనేయులు నిలదీశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకే జగన్ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. విభజనతో రెక్క విరిగిన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి సీఎం నారా చంద్రబాబునాయుడు యత్నిస్తుంటే, జగన్ హడావిడి చేసి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News