: గుంటూరులో ఉద్రిక్తత తప్పదా?... జగన్ దీక్షకు అనుమతి నిరాకరణ, వెనకడుగు లేదన్న వైసీపీ


గుంటూరులో ఎల్లుండి ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు గుంటూరు ఎస్పీ అనుమతి నిరాకరించారు. వైసీపీ నేతలు మూడుసార్లు వినతి పత్రాలు అందించినా, జగన్ దీక్షకు ఎస్పీ సమ్మతించలేదు. నిబంధనల మేరకు చర్యలు చేపడతామన్న ఎస్పీ, దీక్ష చేసేందుకు వైసీపీ ప్రతిపాదించిన వేదిక అనుకూలంగా లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో దీక్ష జరిపి తీరతామని స్పష్టం చేశారు. దీక్షకు సంబంధించి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము ప్రతిపాదించిన స్థలంలోనే జగన్ దీక్ష చేస్తారని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి తప్పేలా లేదు.

  • Loading...

More Telugu News