: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ...భారత్ కు పెట్టుబడులే లక్ష్యంగా వరుస భేటీలు


భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వారం రోజుల విదేశీ పర్యటన కోసం మొన్న బయలుదేరిన మోదీ, నిన్న ఐర్లాండ్ లో ల్యాండయ్యారు. ఐర్లాండ్ ప్రధానితో భేటీ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన మోదీ, కొద్దిసేపటి క్రితం అమెరికా చేరుకున్నారు. భారత్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఫార్చూన్ 500 జాబితాలోని సంస్థల సీఈఓలతో ఆయన విందు సమావేశంలో పాల్గొంటారు. అంతేకాక ఫేస్ బుక్, గూగుల్ తదితర సంస్థల చీఫ్ లతోనూ భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News