: నిధులు పెంచండి...శాస్త్రవేత్తలను నియమించండి: డీఆర్డీవో


డీఆర్డీవో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపింది. బడ్జెట్ లో భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు కేటాయింపులు పెంచాలని కోరింది. పొరుగున ఉన్న చైనా బడ్జెట్ లో 20 శాతం కేటాయిస్తోందని డీఆర్డీవో గుర్తు చేసింది. భారత్ కంటే చైనా ఆరు శాతం నిధులు ఎక్కువగా విడుదల చేస్తోందని డీఆర్డీవో పేర్కొంది. ఈ నిధులతోనే పరిశోధన, అభివృద్ధిపై చైనా డిఫెన్స్ రంగం దృష్టిపెడుతోందని డీఆర్డీవో కేంద్రానికి తెలిపింది. రక్షణ రంగంలో పెరుగుతున్న అవసరాలు, లక్ష్యాలను అందుకోవాలంటే నిధులను పెంచాల్సిన అవసరం ఉందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ప్రస్తుతం కేటాయిస్తున్న బడ్జెట్ తో రక్షణ రంగంలో నిత్యం పెరుగుతున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని డీఆర్డీవో వెల్లడించింది. బడ్జెట్ కేటాయింపులు పెంచడంతోపాటు శాస్త్రవేత్తల నియామకం కూడా ప్రధానమైనదని, అవసరమైనంత మంది శాస్త్రవేత్తలు డీఆర్డీవోకు కావాలని వారు కేంద్రానికి వివరించారు.

  • Loading...

More Telugu News