: దాదా...కాస్త జాగ్రత్త: శ్రీనాధ్ హెచ్చరికలు


టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అతని సహచరుడు, ఐసీసీ రిఫరీ ప్యానెల్ సభ్యుడు జవగళ్ శ్రీనాధ్ స్పందించాడు. దాదాకు భారత క్రికెట్ లో ఉజ్వల భవిష్యత్ ఉందని అన్నాడు. అయితే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉంటే మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ మంది ఎదురవుతారని హెచ్చరించాడు. అయితే, తను ఎలాంటి పదవినైనా సమర్థవంతంగా నిర్వర్తించగలడని గంగూలీకి శ్రీనాథ్ కితాబిచ్చాడు. కాగా, క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ సరైన వ్యక్తి అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. గంగూలీ క్యాబ్ అధ్యక్షుడైతే టీమిండియాపై మరోసారి గంగూలీ ముద్ర కనబడుతుందన్నది సుస్పష్టం.

  • Loading...

More Telugu News