: ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహం ఏర్పాటుకు ఉత్తర్వులు
హైదరాబాదు నగరంలోని ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జి.వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు కాబోతుంది. ఈ మేరకు ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. సాగర్ వర్క్ లో కాకా విగ్రహం ఏర్పాటు చేస్తారు. గతేడాది డిసెంబర్ లో తీవ్ర అనారోగ్యంతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.