: పైలట్ల సమయస్ఫూర్తితో తప్పిన పెను ముప్పు


పైలట్ల సమయస్ఫూర్తితో పెను ముప్పు తప్పింది. ఇరాన్ కు చెందిన ఎయిర్ బోయింగ్ 727 విమానం మొహ్రాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. విమానాశ్రయం చేరుకోగానే విమానాన్ని కిందికి దించేందుకు పైలట్ సిద్ధమవుతుండగా సాంకేతిక లోపంతో ముందు చక్రం తెరుచుకోలేదు. దీంతో పైలట్లు విమానాన్ని చాకచక్యంగా వెనుక వీల్స్ ఆధారం చేసుకుని ల్యాండ్ చేశారు. పైలట్ల ప్రతిభకు ప్రయాణికులు సలాం చేశారు. ఈ సమయంలో విమానంలో 94 మంది ప్రయాణికులు, 19 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వీరంతా ముందు భయాందోళనలకు గురైనా, తరువాత హాయిగా ఊపిరి పీల్చుకుని పైలట్లను అభినందనల్లో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News