: కేంద్రం కూడా మా రాష్ట్రం అనుసరించిన విధానాన్నే పాటించాలి: మమతా బెనర్జీ


స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య ఫైళ్ల విషయంలో తమ రాష్ట్రం అనుసరించిన విధానాన్నే కేంద్రం కూడా పాటించాలని కోరుకుంటున్నట్టు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఈ క్రమంలో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్రం బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తాము ఇప్పటికే 64 ఫైళ్లను వర్గీకరించి విడుదల చేశామని ఉద్ఘాటించారు. అయితే ఆయన నిస్వార్థ సేవలను పూర్తిగా మూల్యాంకనం చేయలేదని పేర్కొన్నారు. అంతేగాకుండా 1937 నుంచి 47 వరకు తమ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను డిజిటలైజ్ చేస్తామని మమత ప్రకటించారు.

  • Loading...

More Telugu News